మరోసారి జంటగా?

అజిత్‌ - నయనతారల జంటకు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘బిల్లా’, ‘విశ్వాసం’ తదితర చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి.

Published : 27 May 2024 01:10 IST

జిత్‌ - నయనతారల జంటకు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘బిల్లా’, ‘విశ్వాసం’ తదితర చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడీ జంట మరోసారి తెరపై సందడి చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్‌ కథానాయకుడిగా అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నాయికగా నయనతార పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది వీళ్లిద్దరి నుంచి రానున్న ఐదో సినిమా కానుంది. ప్రస్తుతం నయన్‌ నటించిన ‘టెస్ట్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘డియర్‌ స్టూడెంట్‌’ చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మమ్ముట్టి, కవిన్‌ రాజ్‌ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని