రక్షణ.. విడుదల ఆరోజే

పాయల్‌ రాజ్‌పూత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’. ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది.

Updated : 28 May 2024 10:11 IST

పాయల్‌ రాజ్‌పూత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’. ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శక నిర్మాత ప్రణదీప్‌ సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక పోలీసు ఆఫీసర్‌ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించిన క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో పాయల్‌ శక్తిమంతమైన పోలీసుగా మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి సాగర్, ఛాయాగ్రహణం: అనిల్‌ బండారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని