యువతారలతో.. యుఫోరియా

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. గుణ హ్యాండ్‌మేడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ‘యుఫోరియా’ అనే సినిమా చేయనున్నారు.

Published : 29 May 2024 00:52 IST

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. గుణ హ్యాండ్‌మేడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ‘యుఫోరియా’ అనే సినిమా చేయనున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను మంగళవారం అధికారికంగా వెల్లడించారు. ఇదొక యూత్‌ఫుల్‌ సోషల్‌ డ్రామా కథతో ముస్తాబు కానుంది. దీనికి తగ్గట్లుగా ఈ సినిమాని యువతారలతో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈలోగా ప్రధాన తారాగణంతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని తెలియజేయనున్నారు. దీనికి నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని