కొత్త కబురు వినిపించారు

కథానాయకుడు కల్యాణ్‌రామ్‌ కొత్త కబురు వినిపించారు. ఆయన తన 21వ చిత్రాన్ని ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు.

Published : 29 May 2024 00:54 IST

థానాయకుడు కల్యాణ్‌రామ్‌ కొత్త కబురు వినిపించారు. ఆయన తన 21వ చిత్రాన్ని ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మంగళవారం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో కల్యాణ్‌రామ్‌ లుక్‌ పూర్తిగా కనిపించకున్నా.. ఆ ప్రచార చిత్రాన్ని బట్టి సినిమాలో ఆయన శక్తిమంతమైన యాక్షన్‌ పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో విజయశాంతితో పాటు సోహెల్‌ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ‘‘ఇదొక మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రమిది. ఇందులో విజయశాంతి పాత్ర ‘కర్తవ్యం’లోని తరహాలో శక్తిమంతంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్‌ విస్సా, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం: రామ్‌ ప్రసాద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు