నా ఆలోచనే మారింది: కాజల్‌

‘ప్రస్తుతం నేను ఎంచుకునే పాత్ర.. చేయబోయే ప్రతి సినిమా విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నా’ అంటోంది సీనియర్‌ నటి కాజల్‌ అగర్వాల్‌. తల్లి అయ్యాక తన గారాలపట్టి నీల్‌ కోసమే మరింత జాగ్రత్తగా ఇలా చేయాల్సి వస్తోందట.

Published : 30 May 2024 01:53 IST

‘ప్రస్తుతం నేను ఎంచుకునే పాత్ర.. చేయబోయే ప్రతి సినిమా విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నా’ అంటోంది సీనియర్‌ నటి కాజల్‌ అగర్వాల్‌. తల్లి అయ్యాక తన గారాలపట్టి నీల్‌ కోసమే మరింత జాగ్రత్తగా ఇలా చేయాల్సి వస్తోందట. సినిమా ప్రచారంలో ఉన్న కాజల్‌ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. ‘నీల్‌ ఈ భూమ్మీదికి వచ్చాక సినిమా, వ్యక్తిగత జీవితాన్ని నేను చూసే విధానమే పూర్తిగా మారిపోయింది. నాకు ఇబ్బంది కలిగించే పాత్రల జోలికి అస్సలు వెళ్లాలనుకోవడం లేదు. ప్రతి చిన్న పని సైతం బాగా ఆలోచించి చేస్తున్నా. నాలో ఓపిక పెరుగుతోంది.. ఇతరుల పట్ల సానుభూతితో ఉంటున్నా. ఏదైనా చిన్న నిర్ణయం తీసుకుంటున్నా.. అది నా కుటుంబంపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అని ఆలోచిస్తున్నా’ అంటూ తన భావోద్వేగ పరిస్థితిని వివరించింది. ‘సత్యభామ’గా సాహసాలు చేయడానికి సిద్ధమవుతున్న కాజల్‌.. అగ్ర నటుడు కమల్‌హాసన్‌ ‘భారతీయుడు 2’లోనూ కనిపించనుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని