చెంగల్వ చేయందేనా..

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో విడుదలైన ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రూపొందింది.

Updated : 30 May 2024 09:13 IST

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో విడుదలైన ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రూపొందింది. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘చెంగల్వ చేయందేనా..’ అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లపై తెరకెక్కించిన ఈ పాటని అనిరుధ్‌ స్వరపరిచారు. రామజోగయ్యశాస్త్రి రచించగా... అబ్బి, శ్రుతికా సముద్రాల ఆలపించారు. ఇప్పటికే ఈ సినిమాలోని ‘శౌర...’ అంటూ సాగే పాటని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌.జె.సూర్య, ప్రియా భవానీశంకర్, నెడుముడి వేణు, వివేక్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రవి వర్మన్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని