‘జ్యువెల్‌ థీఫ్‌’ ముగించాడు

సీనియర్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ‘జ్యువెల్‌ థీఫ్‌’ చిత్రీకరణ ముగించాడు. ఈ విషయాన్ని నటుడు కునాల్‌ కపూర్‌ మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు.

Published : 05 Jun 2024 01:03 IST

సీనియర్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ‘జ్యువెల్‌ థీఫ్‌’ చిత్రీకరణ ముగించాడు. ఈ విషయాన్ని నటుడు కునాల్‌ కపూర్‌ మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు. కీలక నటీనటులతో కూడిన కొన్ని ఫొటోల్ని పంచుకున్నాడు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ నిర్మాతగా రాబీ గ్రేవాల్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రమిది. నికిత దత్తా, జైదీప్‌ అహ్లావత్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్, అప్‌డేట్స్‌ విషయంలో మొన్నటిదాకా చాలా గోప్యతను పాటించిన చిత్రబృందం కొద్దిరోజుల కిందటే దర్శకనిర్మాత సిద్ధార్థ్‌ ఆనంద్, సైఫ్‌ అలీఖాన్‌ కలిసి ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. తాజాగా ‘చిత్రబృందంలో నేనే సీనియర్‌ నటుడిని. షూటింగ్‌ ముగిసినట్టు ప్రకటించే హక్కు నాకుంది’ అంటూ చిత్రీకరణ ముగిసినట్టు కునాల్‌ సరదాగా వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని