రిలే పాత్రకు అనన్య గాత్రం

నటనతోనే కాకుండా యానిమేటెడ్‌ చిత్రాల్లోని పాత్రలకు తమ గాత్రాన్ని అరువుగా ఇస్తూ ఆకట్టుకుంటున్నారు కొందరు బాలీవుడ్‌ తారలు. కొన్ని రోజులు క్రితం ప్రియాంక చోప్రా ‘టైగర్‌’ చిత్రంలోని అంబా అనే ఆడపులి పాత్రకు డబ్బింగ్‌ చెప్పిన సంగతి తెలిసింది.

Published : 05 Jun 2024 01:03 IST

టనతోనే కాకుండా యానిమేటెడ్‌ చిత్రాల్లోని పాత్రలకు తమ గాత్రాన్ని అరువుగా ఇస్తూ ఆకట్టుకుంటున్నారు కొందరు బాలీవుడ్‌ తారలు. కొన్ని రోజులు క్రితం ప్రియాంక చోప్రా ‘టైగర్‌’ చిత్రంలోని అంబా అనే ఆడపులి పాత్రకు డబ్బింగ్‌ చెప్పిన సంగతి తెలిసింది. ఇప్పుడు యువ కథానాయిక అనన్య పాండే కూడా డిస్నీ చిత్రం, హిందీ వెర్షన్‌ ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’లోని రిలే పాత్రకు డబ్బింగ్‌ చెప్పనుందట. ఈ విషయాన్ని అనన్య స్వయంగా ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ఈ సినిమాకి కెల్సే మాన్‌ దర్శకత్వం వహించారు. రిలే మనసులోని ఆరు భావోద్వేగాల చుట్టూ తిరిగే కథనంతో ఈ చిత్రం రూపొందింది. రిలే పాత్రకు తన గళాన్ని అందించడం పట్ల అనన్య తన ఆసక్తిని పంచుకుంది. ‘డిస్నీ, పిక్సర్‌ యానిమేటెడ్‌ చిత్రాలకు నేను  వీరాభిమానిని. ఈ కథలు ప్రేక్షకుల్ని వినోదాత్మక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. కొన్నేళ్ల క్రితం ‘ఇన్‌సైడ్‌ అవుట్‌’ చూసి నా బాల్యాన్ని గుర్తుచేసుకున్నాను. ఇలాంటి రంగుల ప్రపంచంలోని ఓ కథలో భాగమవుతానని ఎప్పుడూ ఊహించలేదు’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ప్రస్తుతం ‘కాల్‌ మీ బె’ అంటూ అభిమానుల ముందుకు రానుంది అనన్య.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని