ఆశిష్‌.. ఆయేషాల ప్రేమ ప్రయాణం మొదలు

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

Published : 05 Jun 2024 01:08 IST

క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇటీవలే తన ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసిన ఈ భామ.. ప్రస్తుతం తన రాబోయే సినిమాల చిత్రీకరణలతో బిజీగా గడుపుతోంది. ఆమె, బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘దే దే ప్యార్‌ దే 2’. 2019లో విడుదలైన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘దే దే ప్యార్‌ దే’కి కొనసాగింపుగా రాబోతున్న చిత్రమిది. అన్షుల్‌ శర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను ముంబయిలో ప్రారంభించినట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది రకుల్‌. ఇందులో అనిల్‌ కపూర్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భూషణ్‌ కుమార్, లవ్‌రంజన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. మధ్య వయసు గల ఆశిష్‌ అనే వ్యక్తి.. 20ఏళ్ల ఆయేషా ప్రేమ కోసం పరితపిస్తుంటాడు. వయసుతో సంబంధం లేకుండా మొదలైన వీరిద్దరి ప్రేమ నెగ్గిందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం రకుల్‌ కీలక పాత్రలో నటించిన ‘ఇండియన్‌ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని