అందగాడే... నచ్చినాడే

చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘ధూం ధాం’. సాయికుమార్, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్,   గోపరాజు రమణ కీలక పాత్రధారులు.

Published : 06 Jun 2024 01:14 IST

చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘ధూం ధాం’. సాయికుమార్, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్,   గోపరాజు రమణ కీలక పాత్రధారులు. సాయికిశోర్‌ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ నిర్మాత. ప్రముఖ రచయిత గోపీమోహన్‌ కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇందులోని ‘మల్లెపూల టాక్సీ...’ పాటని విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ పాటకి గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చగా, గాయని మంగ్లీ ఆలపించారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాటలో ఆమె ఆడిపాడారు కూడా. ‘నూటొక్క జిల్లాల అందగాడే, మా ఇంటి పిల్లకు నచ్చినాడే..’ అంటూ సాగే ఈ పాట తెరపై మరింత కలర్‌ఫుల్‌గా ప్రేక్షకులకు కనువిందు చేస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సిద్ధార్థ్‌ రామస్వామి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని