సరిహద్దులను అధిగమించేది భావోద్వేగాలే!

‘భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామనేది నా అభిప్రాయం’ అని అంటోంది బాలీవుడ్‌ యువ కథానాయిక అలియా భట్‌. ఇటీవల ‘మెట్‌ గాలా’లో మెరిసిన ఈ తార గతేడాది ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Published : 06 Jun 2024 01:15 IST

‘భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామనేది నా అభిప్రాయం’ అని అంటోంది బాలీవుడ్‌ యువ కథానాయిక అలియా భట్‌. ఇటీవల ‘మెట్‌ గాలా’లో మెరిసిన ఈ తార గతేడాది ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో అగ్రతారగా రాణిస్తూ..హాలీవుడ్‌ చిత్రంలో భాగమవడానికి కారణం కథలో ఉన్న భావోద్వేగమని అలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చింది. ‘అన్ని భాషల సినిమాలు చూస్తాను. భాషపై దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్‌ అవుతా. నేను ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ సినిమా చేయడానికి కూడా కారణం అదే. కథ నచ్చింది. పాత్ర మెప్పించింది. సరిహద్దులను అధిగమించేది కథనంలోని భావోద్వేగాలు మాత్రమే. అందుకే హాలీవుడ్‌లో అవకాశం వస్తే నటించా’ అని అంది. ‘తొలినాళ్ల నుంచి వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం అదృష్టం నా. నేనేదైనా పాత్ర చేస్తున్నానంటే ఆ పాత్రలో మునిగిపోతాను. భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామనేది నా అభిప్రాయం. అలాంటి పాత్రలు కలిగే సినిమాలు చేయగలనా అని నాకు నేను సవాలు చేసుకుంటా’ అని ముగించింది. ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాతో బిజీగా ఉంది అలియా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని