హీరోగా నాకెంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది

కార్తికేయ, ఐశ్వర్య మేనన్‌ జంటగా ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘భజే వాయు వేగం’. యూవీ కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మించింది. రాహుల్‌ టైసన్‌ కీలక పాత్ర పోషించారు.

Published : 07 Jun 2024 00:22 IST

కార్తికేయ, ఐశ్వర్య మేనన్‌ జంటగా ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘భజే వాయు వేగం’. యూవీ కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మించింది. రాహుల్‌ టైసన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘హీరోగా నాకెంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాని టైమ్‌లో దర్శకుడు ప్రశాంత్‌ ఈ కథతో నాకు దారి చూపించాడు. విజయమనే టార్చిలైట్‌ ఇచ్చాడు. గతంలో నా గురించి రాసేటప్పుడు మరో అపజయం అందుకున్నాడని రాసేవారు. ఇప్పుడు ఏడాదిలోపే రెండో హిట్‌ అందుకున్నాని రాస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇకపై సినిమాలు చేస్తా’’ అన్నారు. ‘‘ఇది మంచి సినిమా కాబట్టే ప్రేక్షకులు తమ మౌత్‌ టాక్‌తో దీన్ని అందరికీ తెలిసేలా చేశారు. యూవీ సంస్థలో నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననే భావిస్తున్నా’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాహుల్‌ టైసన్, ఐశ్వర్య, జి.సత్య, కపిల్‌ కుమార్, మధు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


మహారాజ వస్తున్నాడు 

విజయ్‌ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’ విడుదలకి సిద్ధమైంది. ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో... సుధన్‌ సుందరం, జగదీశ్‌ పళనిస్వామి నిర్మించిన చిత్రమిది. అనురాగ్‌ కశ్యప్‌ ఒక శక్తిమంతమైన పాత్రలో నటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని ఎస్‌.వి.ఆర్‌ సినిమా సంస్థ విడుదల చేస్తోంది. మమతా మోహన్‌దాస్, నట్టి, భారతీరాజా, అభిరామి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:   బి.అజనీష్‌ లోక్‌నాథ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని