ఇప్పుడే ఎక్కువ రిస్క్‌ చేస్తున్నా!

నటనతో పాటు తన గాత్రంతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది అందాల తార శ్రుతి హాసన్‌. ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటన, అలరించే గాత్రం ఈమె సొంతం.

Published : 07 Jun 2024 00:29 IST

టనతో పాటు తన గాత్రంతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది అందాల తార శ్రుతి హాసన్‌. ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటన, అలరించే గాత్రం ఈమె సొంతం. ఇటీవల అగ్రనటుడు, తన తండ్రి కమల్‌హాసన్‌ చిత్రం ‘భారతీయుడు 2’ ఆడియో విడుదల వేడుకలో తన పాటతో అందర్ని ఆకట్టుకున్న శ్రుతి తన మ్యూజికల్‌ కెరీర్‌ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించింది. ‘ఒకవైపు సంగీతం, మరోవైపు నటనతో చాలా ఆనందంగా గడుపుతున్న రోజులివి. ఈ రెండింటితో కొనసాగుతున్న ఈ దశ నాకెంతో ప్రత్యేకమైనది. గడిచిన రోజుల కంటే ఇప్పుడే ఎక్కువ రిస్కీ పనులు చేస్తున్నానని చెప్పాలి. నా కెరీర్‌ సంగీతంతోనే మొదలైంది. ఆ తర్వాతే సినిమాలు, నటన నా జీవితంలోకొచ్చాయి. నేను ఇష్టపడేవి రెండూ నా జీవితంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా’ అని అంది. తన తండ్రి ముందు, ‘భారతీయుడు 2’ ఆడియో వేడుకలో ఆమె చేసిన సంగీత ప్రదర్శన పట్ల ఆనందాన్ని పంచుకుంటూ.. ‘అదొక అందమైన అనుభవం. మా నాన్నని సంగీతంతో సత్కరించేందుకు ఆ వేడుకకి నన్ను ఆహ్వానించినందుకు గర్వంగా ఉంది. నా పాటల్ని ఎప్పుడూ మా నాన్నతో పంచుకుంటూ ఉంటా’ అంటూ ముచ్చటించిందీమె.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు