కార్తి.. ఎంజీఆర్‌ అభిమాని!

గతేడాది ‘జపాన్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కార్తి ఇప్పుడు కొత్త చిత్రంతో రాబోతున్నారు.

Published : 08 Jun 2024 01:08 IST

తేడాది ‘జపాన్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కార్తి ఇప్పుడు కొత్త చిత్రంతో రాబోతున్నారు. కార్తి హీరోగా నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో వస్తున్న ఆ యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనరే ‘వా వాతియార్‌.’ కేఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. తాజాగా ఈ చిత్రం నుంచి కార్తి ఫస్ట్‌లుక్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. పోలీసు అవతారంలో ఉన్న కార్తి, ఆయన వెనకాల తమిళ అగ్రనటుడు ఎంజీఆర్‌ వేసిన అనేక గెటప్పులు..ఇలా ఆసక్తిగా ఉన్న పోస్టర్‌ చిత్రంపై అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాలో ఎంజీఆర్‌ అభిమానిగా కార్తి కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు