ఆషికా.. మిస్‌ యు

‘నా సామిరంగ’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆషికా రంగనాథ్‌ ప్రస్తుతం చిరంజీవితో ‘విశ్వంభర’లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Published : 08 Jun 2024 01:10 IST

‘నా సామిరంగ’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆషికా రంగనాథ్‌ ప్రస్తుతం చిరంజీవితో ‘విశ్వంభర’లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ అమ్మడు మరో అవకాశం అందిపుచ్చుకుంది. ప్రస్తుతం సిద్ధార్థ్‌ హీరోగా ఎన్‌.రాజశేఖర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నాయికగా ఆషికాను ఎంపిక చేశారు. ఆమె ఈ విషయాన్ని ఇన్‌స్టాలో స్వయంగా ప్రకటించారు. ఈ సినిమాకి ‘మిస్‌ యు’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలియజేస్తూ ఫస్ట్‌లుక్‌ను పంచుకున్నారు. ‘‘హృదయాన్ని కదిలించే ఈ అందమైన కథలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకెంతో ప్రత్యేకం’’ అంటూ ఆ పోస్టర్‌కు ఓ వ్యాఖ్యను కూడా జత చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు