తాత వస్తాడే... అదరగొడతాడే

‘భారతీయుడు2’ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

Published : 08 Jun 2024 01:11 IST

భారతీయుడు2’ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలోని ‘తాత వస్తాడే...  అదరగొట్టి పోతాడే...’ అంటూ సాగే పాటని శుక్రవారం విడుదల చేశారు. అనిరుధ్‌ స్వరకల్పనలోని ఈ పాటకి, కాసర్ల శ్యామ్‌ సాహిత్యం సమకూర్చారు. అరుణ్‌ కౌండిన్య ఆలపించారు. కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా... శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 1996లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. రకుల్‌ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్‌ కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని