ఈరోజు చిత్ర పరిశ్రమ బంద్‌

రామోజీరావు మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చలన చిత్ర నిర్మాతల మండలి శనివారం ప్రకటించింది

Updated : 09 Jun 2024 06:48 IST

రామోజీరావు మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చలన చిత్ర నిర్మాతల మండలి శనివారం ప్రకటించింది. ‘‘రామోజీరావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. తెలుగు వార్తా రంగంలో, వినోద రంగంలో ఆయన ఎనలేని కృషి చేశారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సేవలందించారు. ఆయన చేసిన సేవలు ప్రతి భారతీయుడి మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి’’ అని ఆ ప్రకటనలో నిర్మాతల మండలి పేర్కొంది. ఇక రామోజీ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా సంతాపం తెలియజేశాయి. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని