భావోద్వేగాల లాక్‌డౌన్‌

ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారిలో చిక్కుకున్న ఓ అమ్మాయి.. నాన్న నాన్న అంటూ ఆవేదనతో పిలుస్తోంది. మరి ఆమె కథేమిటో తెలుసుకోవాలంటే ‘లాక్‌డౌన్‌’ సినిమా చూడాల్సిందే.

Published : 10 Jun 2024 00:54 IST

ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారిలో చిక్కుకున్న ఓ అమ్మాయి.. నాన్న నాన్న అంటూ ఆవేదనతో పిలుస్తోంది. మరి ఆమె కథేమిటో తెలుసుకోవాలంటే ‘లాక్‌డౌన్‌’ సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం వరుస చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. ఏఆర్‌ జీవా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఎక్స్‌ వేదికగా విడుదల చేసింది లైకా ప్రొడక్షన్స్‌. ‘‘నిరీక్షణ ముగిసింది. గందరగోళం, కుట్రలు, భావోద్వేగాలతో కూడిన ‘లాక్‌డౌన్‌’ టీజర్‌ వచ్చేసింద’’ని వ్యాఖ్యల్ని జోడించింది. ఆందోళనగా వీధుల్లో తిరుగుతున్న అనుపమను చూపిస్తూ.. భావోద్వేగాలతో సాగుతున్న ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత తెలియని ప్రదేశంలో చిక్కుకున్న ఓ అమ్మాయి కథను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని