హిందీ పిలిచిందా?

తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్‌ నాయికగా పేరు తెచ్చుకుంది శ్రీలీల. ఇటు అగ్రహీరోలతోనూ అటు కుర్ర కథానాయకులతోనూ జోడీ కడుతూ వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది.

Published : 10 Jun 2024 00:55 IST

తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్‌ నాయికగా పేరు తెచ్చుకుంది శ్రీలీల. ఇటు అగ్రహీరోలతోనూ అటు కుర్ర కథానాయకులతోనూ జోడీ కడుతూ వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. అయితే ఇప్పుడీ నాయిక బాలీవుడ్‌లో తొలి అడుగు వేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌ హీరోగా కునాల్‌ దేశ్‌ముఖ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మడాక్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా కోసం నాయికగా శ్రీలీల పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడీ విషయమై కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంటెన్స్‌ లవ్‌స్టోరీతో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలిసింది. ఇక శ్రీలీల ప్రస్తుతం తెలుగులో పవన్‌ కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లో నటిస్తోంది. అలాగే రవితేజ - భాను భోగవరపు కలయికలో తెరకెక్కనున్న చిత్రంలోనూ నాయికగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని