శనివారం స్పీకర్లు బద్దలవుతాయి!

ఈ శనివారం తన ఆవేశాన్ని పరిచయం చేస్తానంటున్నారు నాని. ఇప్పుడాయన కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Published : 11 Jun 2024 00:43 IST

శనివారం తన ఆవేశాన్ని పరిచయం చేస్తానంటున్నారు నాని. ఇప్పుడాయన కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 15న తొలి గీతం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సోమవారం ప్రకటించారు. ఈ శనివారం నాని తన ఆవేశంతో మీ స్పీకర్లను బద్దలు కొడతాడంటూ చిత్రవర్గాలు సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని