బాలీవుడ్‌ నటి ఆత్మహత్య

బాలీవుడ్‌ నటి నూర్‌ మలాబికా దాస్‌(31) ముంబయిలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది కాజోల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ది ట్రయల్‌’ వెబ్‌సిరీస్‌లో నూర్‌ కీలక పాత్ర పోషించారు.

Published : 11 Jun 2024 00:44 IST

బాలీవుడ్‌ నటి నూర్‌ మలాబికా దాస్‌(31) ముంబయిలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది కాజోల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ది ట్రయల్‌’ వెబ్‌సిరీస్‌లో నూర్‌ కీలక పాత్ర పోషించారు. మంగళవారం సాయంత్రం నూర్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు. తన అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్వాసన వస్తోందని చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కుళ్లిన మృతదేహం తన సొంత ఫ్లాట్‌లో శుక్రవారం బయటపడింది. ఈమె డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, మందులు వాడుతున్నారని తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని అధికారులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు