33,000 అడుగుల ఎత్తులో సికందర్‌ యాక్షన్‌!

మనల్ని మనం నిరూపించుకునే అవకాశం కొద్దిమందికే వస్తుందంటూ చెప్పే అందాల తార రష్మిక..  వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా గడుపుతున్న ఈ భామ.. బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ‘సికందర్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 11 Jun 2024 00:44 IST

నల్ని మనం నిరూపించుకునే అవకాశం కొద్దిమందికే వస్తుందంటూ చెప్పే అందాల తార రష్మిక..  వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా గడుపుతున్న ఈ భామ.. బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ‘సికందర్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ త్వరలో మొదలుకానుందని తెలుపుతూ..ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు నిర్మాత సాజిద్‌ నడియాడ్‌ వాలా. ‘‘ఈ నెల 18న ‘సికందర్‌’ యాక్షన్‌ ప్రారంభం కానుంది. మొదటి రోజున అతిపెద్ద ఎయిర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఈ షూటింగ్‌ను ఆరంభించనున్నామని తెలుపడానికి చాలా ఉత్సాహంగా ఉంద’’ని వ్యాఖ్యాల్ని జోడించారు. తొలి షెడ్యూల్‌లో భాగంగా సల్మాన్‌తో సముద్రమట్టానికి దాదాపు 33,000 అడుగుల ఎత్తులో అద్భుతమైన వైమానిక యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు, ఇది ఈ ప్రాజెక్టుకే కీలకమైన సన్నివేశమని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈద్‌కి విడుదల కానుందీ చిత్రం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు