బలవంతులే ఇక్కడ జీవించగలరు

‘మీర్జాపూర్‌’.. బాలీవుడ్‌లో ఎంతో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌ ఇది. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు మంచి విజయాన్ని అందుకున్నాయి.

Updated : 12 Jun 2024 05:54 IST

మీర్జాపూర్‌’.. బాలీవుడ్‌లో ఎంతో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌ ఇది. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు సినీప్రియులకు ఓ తీపి కబురు వినిపించింది సిరీస్‌ బృందం. తాజాగా మూడో సీజన్‌ను ప్రకటిస్తూ.. ఇన్‌స్టా వేదికగా టీజర్‌ను విడుదల చేసింది. పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, విజయ్‌ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అధికారం, ప్రతీకారం, ఆశయం, రాజకీయాలు లాంటి అంశాల మేళవింపుతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘మీర్జాపూర్‌ 3’ని రూపొందిస్తున్నారు. ‘‘ఎంతో వేగంగా పరుగెత్తే చిరుత కూడా సింహం పదునైన గోళ్లకు సరిపోదు’, ‘గాయపడిన సింహం మళ్లీ వచ్చింది. బలవంతులు మాత్రమే ఈ అడవిలో జీవించగలరు’’ లాంటి సంభాషణలతో సాగుతున్న ఈ టీజర్‌ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ముందు సీజన్ల కంటే మరింత ఉత్కంఠభరితంగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌.. వచ్చే నెల 5నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని