రవితేజ 75వ చిత్రం ప్రారంభం

‘ధమాకా’తో అలరించారు రవితేజ - శ్రీలీల. ఈ జోడీ మరో సినిమాతో సందడి చేయనుంది. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఆ సినిమా మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

Published : 12 Jun 2024 00:40 IST

మాకా’తో అలరించారు రవితేజ - శ్రీలీల. ఈ జోడీ మరో సినిమాతో సందడి చేయనుంది. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఆ సినిమా మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజకు ఇది 75వ చిత్రం. యువ రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. పూజా కార్యక్రమాలతో పాటు, మంగళవారం నుంచే రెగ్యులర్‌ చిత్రీకరణనీ ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి శ్రీలీల క్లాప్‌నిచ్చారు. ‘‘రవితేజ అనగానే గుర్తొచ్చేది మాస్‌ అంశాలు, కామెడీనే. మరోసారి మాస్‌ పాత్రతో ఆయన హాస్యం పంచనున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకి రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఓ మంచి స్క్రిప్ట్‌తో, రవితేజ 75వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ధమాకా’ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు సమకూరుస్తున్నార’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, కూర్పు: నవీన్‌  నూలి, సంభాషణలు: నందు సవిరిగాన, కళ: నాగేంద్ర తంగాల, సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని