రణ్‌వీర్‌కి ప్రతిష్ఠాత్మక పురస్కారం

బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్‌ ప్రతిష్ఠాత్మక మరకేష్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఎటైల్‌ డియోర్‌ అవార్డు’ పురస్కారం అందుకున్నారు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Published : 15 Nov 2022 02:07 IST

బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్‌ ప్రతిష్ఠాత్మక మరకేష్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఎటైల్‌ డియోర్‌ అవార్డు’ పురస్కారం అందుకున్నారు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ‘సినిమా ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. నా నటన, వృత్తి.. సాంస్కృతిక, భౌగోళిక సరిహద్దులు దాటి ఇంతదూరం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసినందుకు మరకేష్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులకు కృతజ్ఞతలు. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకు ఒక సాంస్కృతిక రాయబారిగా మారినందుకు గర్వపడుతున్నా’ అంటూ అందులో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రణ్‌వీర్‌ ‘సర్కస్‌’ చిత్రీకరణ జరుగుతుండగా, ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.


సైగల భాషలో ‘83’ ప్రదర్శన

దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘83’. కబీర్‌ఖాన్‌ దర్శకుడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని మూగవాళ్ల కోసం సైగల భాషలో ప్రదర్శించబోతున్నారు. ఈ సందర్భంగా రణ్‌వీర్‌సింగ్‌ వాళ్లకి మద్దతుగా ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ (సైగల భాష)ని 23వ అధికారిక భాషగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘వైకల్యం కారణంగా వెనుకబాటుకు గురైనా.. మూగ, చెవిటి వాళ్లకు ఈ సమాజంలో సమాన అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నా. అధికారిక భాషగా గుర్తించాలని వాళ్లు మొదలుపెట్టిన పిటిషన్‌పై సంతకం పెట్టా. మనదేశం ప్రపంచంలో అత్యుత్తమ ప్రదేశంగా చెప్పుకోవాలంటే ఈ సమాజమంతా ఒక్కటి కావాలి. వాళ్లకి మద్దతుగా నిలవాలి’ అంటూ తన అభిప్రాయం వెలిబుచ్చారు రణ్‌వీర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని