ప్రతి అంగుళం భూమి చిత్రపరిశ్రమకే ఉపయోగపడాలి
‘సేవ్ ఫిల్మ్ ఛాంబర్’ ర్యాలీలో సినీ నటులు, నిర్మాతలు

కొవ్వొత్తుల ర్యాలీలో డి.సురేశ్‌బాబు, మురళీమోహన్, జెమిని కిరణ్, అశోక్‌కుమార్ తదితరులు
ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే : హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆవరణలో ‘సేవ్ ఫిల్మ్ ఛాంబర్.. బ్రింగ్ బ్యాక్ ది గ్లోరీ’ అంటూ సినీ నిర్మాతలు, నటులు సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ నిర్మాతలు డి.సురేశ్ బాబు, జెమిని కిరణ్, సినీ నటులు మురళీమోహన్, కె.అశోక్‌కుమార్, శివాజీరాజా, ఏడిద రాజా తదితరులు పాల్గొన్నారు. మురళీమోహన్, డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చేలా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించిందని, ప్రత్యేకంగా స్థలం కేటాయించగా అందులో ఫిల్మ్‌ఛాంబర్ భవనం నిర్మించినట్లు గుర్తుచేశారు.
దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనంలో ఇప్పటికీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కార్యాలయాలు ఉన్నాయన్నారు. దీన్ని ఎవరికో డెవలప్మెంట్కు ఇచ్చి అందులో మూడు వంతుల షేర్ కేటాయించటం ఎంతమాత్రం తగదన్నారు. ఇక్కడున్న ప్రతి అంగుళం సినిమా పరిశ్రమకే ఉపయోగపడాలన్నారు. సినీ నటుడు అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఫిల్మ్‌ఛాంబర్ అభివృద్ధిపై సినీ పెద్దలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు, నిర్మాతలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆస్కార్‌లో లాబీయింగ్‌కు అవకాశం
తనకు అవార్డుల కంటే నటన బాగుందని ప్రశంసలు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావెల్. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలో లాబీయింగ్‌కు ఆస్కారం ఉందని చెప్పారు. - 
                                    
                                        

జానపదానికి స్టెప్పేస్తే..!
కథానాయకుడు రవితేజ.. దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. - 
                                    
                                        

ఆ రాకెట్‌కు ‘బాహుబలి’ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

కేరళ అడవుల్లో మైసా
రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరిం చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడామె ప్రధాన పాత్రధారిగా కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. - 
                                    
                                        

స్వర్ణోత్సవ వేడుకకు రంగం సిద్ధం
విలక్షణ నటుడిగా.. అభిరుచి గల నిర్మాతగా సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు మంచు మోహన్‌బాబు. - 
                                    
                                        

ఆమె ఓ స్టార్ అనే భావన రానివ్వలేదు
‘ప్రేమని మరో కోణంలో చూపించే సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఇందులోని పాత్రలు, సందర్భాలు మన జీవితాలతో రిలేట్ చేసుకునేలా ఉంటాయి’’ అన్నారు హీరో దీక్షిత్ శెట్టి. ఆయన.. రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. - 
                                    
                                        

డిసెంబరులో అనన్య చిత్రం
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’. గతంలో కార్తిక్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సమీర్ విద్వాన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా ఉన్నా
‘‘యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘ఫీనిక్స్’. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకముంది’’ అన్నారు కథానాయకుడు విజయ్ సేతుపతి. - 
                                    
                                        

ఒక్క క్షణమైనా ప్రేమించావా?
‘‘మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తే.. మిమ్మల్ని ఎక్కువగా బాధించేవాడు! కళ్లతో చెప్పగలిగినది, మనసుతో చెప్పలేకపోయింది’’ అంటూ శంకర్ ముక్తిల గొప్ప ప్రపంచం నుంచి ‘ఉసే కహ్నా’ అనే గీతాన్ని విడుదల చేసింది ‘తేరే ఇష్క్ మే’ చిత్రబృందం. - 
                                    
                                        

కేరళ పురస్కారాల్లో మంజుమ్మల్ బాయ్స్ సత్తా
వయసుతో సంబంధం లేకుండా పాత్రలతో ప్రయోగాలు చేసే అగ్రహీరో మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా సత్తా చాటారు. సోమవారం 55వ చలన చిత్ర అవార్డులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
చదువు కూడా లేని ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. అక్కడి రాజకీయ రాబందులకు కూడా చెక్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగిందన్న కథాంశం ఆధారంగా రూపొందిన సిరీస్ ‘మహారాణి సీజన్ 4’. బాలీవుడ్ కథానాయిక హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో పునీత్ ప్రకాశ్ దీన్ని తెరకెక్కించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

పెట్టుబడుల విషయంలో పూర్తిగా సహకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
 - 
                        
                            

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
 - 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 


