ఇది సైన్స్‌ ఊహకే అందనిది!

Eenadu icon
By Cinema Desk Updated : 02 Nov 2025 10:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈ క్రిస్మస్‌ బరిలో ‘శంబాల: ఎ మిస్టికల్‌ వరల్డ్‌’తో థ్రిల్‌ పంచేందుకు సిద్ధమవుతున్నారు ఆది సాయికుమార్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని యుగంధర్‌ ముని తెరకెక్కించారు. రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించారు. అర్చన అయ్యర్, శ్వాసిక కథానాయికలు. రవివర్మ, మధునందన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం డిసెంబరు 25న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే కథానాయకుడు ప్రభాస్‌ శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

‘‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి.. అసురుడికి మధ్య జరిగిన ఒక భీకర యుద్ధం ఈ కథకి మూలం’’ అంటూ సాయికుమార్‌ డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ సాగింది. ఇది దేవుడు, నమ్మకం, సైన్స్‌ అంశాలతో ముడిపడి సాగే సినిమా. శంబాల గ్రామంలో ఆకాశం నుంచి ఓ భారీ రాయి లాంటి వింత వస్తువు రాలిపడటం.. ఆ తర్వాత నుంచి ఆ ఊర్లో వరుస చావులు మొదలవ్వడం.. ఆ సమస్యను పరిష్కరించడం కోసం హీరో రంగంలోకి దిగడం ట్రైలర్‌లో చూపించారు. ‘‘ప్రతి ప్రశ్నకి సైన్స్‌లో ఒక సమాధానం ఉంటుందనుకున్నాను. కానీ, ఇది సైన్స్‌ ఊహకే అందనిది’’ అంటూ ట్రైలర్‌లో ఆది సాయికుమార్‌ చెప్పిన డైలాగ్‌ ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: ప్రవీణ్‌ కె బంగారి.


Tags :
Published : 02 Nov 2025 02:14 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు