Girls Will Be Girls: కేన్స్‌ చిత్రోత్సవాల్లో గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌

వైవిధ్యమైన కథలకు తెర రూపం ఇచ్చే ఉద్దేశంతో నట జంట రిచా చద్ధా, అలీ ఫజల్‌ ప్రారంభించిన బ్యానర్‌.. పుషింగ్‌ బటన్స్‌ స్టూడియోస్‌. ఈ పతాకంపై నిర్మించిన మొదటి చిత్రం ‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’. దీంతో సుచీ తలాటీ దర్శకురాలిగా పరిచయం అయ్యారు.

Updated : 22 May 2024 00:56 IST

వైవిధ్యమైన కథలకు తెర రూపం ఇచ్చే ఉద్దేశంతో నట జంట రిచా చద్ధా, అలీ ఫజల్‌ ప్రారంభించిన బ్యానర్‌.. పుషింగ్‌ బటన్స్‌ స్టూడియోస్‌. ఈ పతాకంపై నిర్మించిన మొదటి చిత్రం ‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’. దీంతో సుచీ తలాటీ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. పలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు, అవార్డులు అందుకున్న ఈ చిత్రం మరో ఘనత సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చిత్రోత్సవాల్లో ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ విభాగంలో ప్రదర్శించేందుకు ఎంపికైంది. సృజనాత్మక కథనం, భిన్న సంస్కృతి, వైవిధ్యమైన సినిమా కళను యువ ప్రేక్షకులకు పరిచయం చేసే ఉద్దేశంతో రెండు చిత్రాలను ఎంపిక చేయగా.. అందులో ఒకటిగా నిలిచింది ‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’. దీన్ని మే 22, 23 తేదీల్లో రైమూ హాల్‌లో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో ప్రీతి పాణిగ్రాహి ప్రధాన పాత్ర పోషించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు