Gopichand: ప్రభాస్‌తో మరో సినిమా: గోపీచంద్‌ ఏమన్నారంటే?

‘ప్రభాస్‌తో కలిసి మరో సినిమాలో నటిస్తారా?’ అనే ప్రశ్నకు హీరో గోపీచంద్‌ ఏం సమాధానమిచ్చారంటే?

Updated : 01 Mar 2024 21:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వర్షం’ (Varsham) చిత్రంలో ప్రభాస్‌ (Prabhas), గోపీచంద్‌ (Gopichand) హీరో, విలన్లుగా కనిపించినా తెర వెనక వీరిద్దరూ మంచి స్నేహితులు. అందుకే ఈ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మీ ఇద్దరూ మళ్లీ కలిసి నటిస్తారా?’ అంటూ సినీప్రియుల తరఫున యాంకర్‌ అడగ్గా ఎప్పుడనేది తెలియదుగానీ తప్పకుండా ఓ సినిమా చేస్తామని గోపీచంద్‌ బదులిచ్చారు. కథా నేపథ్యం, ఇతరత్రా వివరాల గురించి ఇంకా ఏమనుకోలేదని, ప్రభాస్‌తో కలిసి మళ్లీ నటించాలనుందని చెప్పారు. ఈ కాంబోలో సినిమా నిర్మించేందుకు తాను సిద్ధమని నిర్మాత కె.కె. రాధామోహన్‌ తెలిపారు. ‘భీమా’ (Bhimaa) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రత్యేక ఇంటర్వ్యూలో గోపీచంద్‌, రాధామోహన్‌.. ప్రభాస్‌తో సినిమాపై తమ అభిప్రాయం వ్యక్తంచేశారు.

కెరీర్‌ ప్రారంభంలో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ సినిమాల్లో గోపీచంద్‌ ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. 2004 సంక్రాంతికి విడుదలైన ‘వర్షం’ సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనితర్వాత గోపీచంద్‌ మరే సినిమాలోనూ విలన్‌గా నటించలేదు. మరి, భవిష్యత్తులో నటించబోయే సినిమాలో ఇద్దరూ హీరోలుగానే కనిపిస్తారా? ఒకరు హీరో, మరొకరు విలన్‌గా నటిస్తారా? అంటే వేచి చూడాల్సిందే.

‘భీమా’ విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని ఫాంటసీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కించారు. గోపీచంద్‌ ఇందులో పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా నటించారు. ఆయన సరసన మాళవికశర్మ, ప్రియా భవానీ శంకర్‌ సందడి చేయనున్నారు. ఈ మూవీ మార్చి 8న (Bhimaa Movie Release Date) ప్రేక్షకుల ముందుకురానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని