OG - Guntur Kaaram: ‘ఓజీ’ ఎప్పటికీ మాదే.. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్

‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘ఓజీ’ (OG) చిత్రాల విషయంలో నెలకొన్న సందిగ్ధతలపై చిత్ర నిర్మాణ సంస్థలు స్పష్టతనిచ్చాయి.

Updated : 08 Jan 2024 14:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా సుజీత్‌ (Sujeeth) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) (OG). ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు వేరే ప్రొడక్షన్‌ హౌస్‌ చేతికి వెళ్లాయంటూ జరుగుతున్న ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్పందించింది. ‘‘ఓజీ’ మా సినిమా. ఎప్పటికీ మాదే. ఈ సినిమా ఎలా ఉండబోతుందో మాకు స్పష్టత ఉంది. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. ఆకలితో ఉన్న చిరుత దేనిని వదిలిపెట్టదు’’ అని ట్వీట్‌ చేసింది.

ముంబయి - జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతోంది. పవన్‌ సరసన ప్రియాంకా మోహన్‌ కనిపించనున్నారు. ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

ప్రీ రిలీజ్‌కు ముహుర్తం ఖరారు..!

మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విషయంలో నెలకొన్న సందిగ్ధతపై చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. మంగళవారం (జనవరి 9) సాయంత్రం గుంటూరు జిల్లాలోని నంబూరు క్రాస్‌రోడ్స్‌ వద్ద జరగనుందని తెలిపింది. దీనిపై మహేశ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని