Guntur kaaram ott: ఓటీటీలో ‘గుంటూరుకారం’.. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్‌

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చని ‘గుంటూరు కారం’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Updated : 04 Feb 2024 11:10 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరుకారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా  వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ‘గుంటూరు కారం’ అందుబాటులోకి రానుంది. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూర్చారు. 

కథేంటంటే: వైరా వ‌సుంధ‌ర (ర‌మ్య‌కృష్ణ‌), రాయ‌ల్ స‌త్యం (జ‌య‌రామ్‌) కొడుకు వీర వెంక‌ట ర‌మ‌ణ అలియాస్ ర‌మ‌ణ (మ‌హేశ్‌బాబు). చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులిద్ద‌రూ విడిపోవ‌డంతో అతడు గుంటూరులో తన మేన‌త్త బుజ్జి (ఈశ్వ‌రిరావు) ద‌గ్గ‌ర పెరుగుతాడు. వ‌సుంధ‌ర మ‌రో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయ శాఖ మంత్రి అవుతుంది. ఆమె తండ్రి వైరా వెంక‌టస్వామి (ప్ర‌కాశ్‌రాజ్‌) అన్నీ తానై రాజ‌కీయ చ‌క్రం తిప్పుతుంటాడు. వ‌సుంధ‌ర రాజ‌కీయ జీవితానికి ఆమె మొద‌టి పెళ్లి, మొద‌టి కొడుకు అడ్డంకిగా మార‌కూడ‌ద‌ని భావించిన వెంక‌ట‌స్వామి... ర‌మ‌ణ‌తో ఓ అగ్రిమెంట్‌పై సంత‌కం పెట్టించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడ‌తాడు. వ‌సుంధ‌ర‌కి పుట్టిన రెండో కొడుకుని ఆమె వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. (Guntur Kaaram) త‌ల్లిని ఎంతో ప్రేమించే ర‌మ‌ణ... ఆ అగ్రిమెంట్‌పై సంత‌కం పెట్టాడా?ఇంత‌కీ అందులో ఏముంది?త‌న త‌ల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? క‌న్న కొడుకుని వ‌సుంధ‌ర ఎందుకు వ‌దిలిపెట్టింది? అన్నది చిత్ర కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని