Gurthunda Seethakalam: జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే చిత్రమిది
‘‘ప్రేమలో తీసుకోవడమే కాదు... ఇవ్వడం కూడా ముఖ్యమే! విలువైన ప్రేమలు ఎలా ఉండాలో మా సినిమాతో చెప్పబోతున్నాం’’ అన్నారు చింతపల్లి రామారావు.
‘‘ప్రేమలో తీసుకోవడమే కాదు... ఇవ్వడం కూడా ముఖ్యమే! విలువైన ప్రేమలు ఎలా ఉండాలో మా సినిమాతో చెప్పబోతున్నాం’’ అన్నారు చింతపల్లి రామారావు. ఆయన... భావనా రవి, నాగశేఖర్ ఎమ్.ఎస్.రెడ్డి, చినబాబులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam). సత్యదేవ్, తమన్నా జంటగా నటించారు. నాగశేఖర్ దర్శకుడు. కన్నడలో విజయవంతమైన ‘లవ్ మాక్‌టైల్’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చింతపల్లి రామారావు బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
* ‘‘యవ్వనం మొదలుకొని.. మధ్య వయసు వరకు ప్రతి ఒక్కరూ తన జీవిత భాగస్వామి గురించి కలలు కంటూ ఉంటారు. ఆ క్రమంలోనే ప్రేమలు పుడుతుంటాయి. కొన్ని ప్రేమలు విజయవంతం అవుతాయి, మరికొన్ని జ్ఞాపకాలుగా మనసు పొరల్లో జీవితాంతం నిలిచిపోతాయి. అలాంటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లేదే ఈ చిత్రం’’.
* ‘‘సత్యదేవ్, తమన్నా జోడీ చిత్రానికి ప్రధాన బలం. మా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 600కిపైగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగమార్తాండ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఆ సినిమాలోనూ మాకు ఆర్థికంగా భాగస్వామ్యం ఉంది. ఎన్టీఆర్ బావమరిది నితిన్‌తో ‘శ్రీశ్రీశ్రీరాజావారు’ సినిమా చేస్తున్నాం. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది’’.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సభ.. జనసమీకరణపై నేతలతో కేటీఆర్ భేటీ
-
Movies News
Social Look: పూజా సీమంతం.. శ్రద్ధాదాస్ హాఫ్‌శారీ.. టీమ్‌తో రాశీఖన్నా!
-
World News
Earthquake: తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 17వేలు దాటిన మరణాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!
-
Politics News
Chandrababu: జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు