Hainanna: పార్టీ ఎక్కడ జరిగినా ఈ పాటే మోగాలి

‘‘పైకి తియ్‌ లోన హాయిని.. బయట వెయ్‌ లోపలోడిని.. దాచుకోకు ఇంక దేనిని.. గోలే నీ పని’’ అంటూ చిందేస్తున్నారు కథానాయకుడు నాని.

Updated : 29 Nov 2023 09:51 IST

‘‘పైకి తియ్‌ లోన హాయిని.. బయట వెయ్‌ లోపలోడిని.. దాచుకోకు ఇంక దేనిని.. గోలే నీ పని’’ అంటూ చిందేస్తున్నారు కథానాయకుడు నాని. ఆయన.. మృణాల్‌ ఠాకూర్‌ జంటగా కొత్త దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘హాయ్‌ నాన్న’. మోహన్‌ చెరుకూరి, విజేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. శ్రుతిహాసన్‌ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా డిసెంబరు 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని నాలుగో గీతాన్ని హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కళాశాలలో విడుదల చేశారు. నాని, శ్రుతిహాసన్‌లపై చిత్రీకరించిన పాటిది. ‘‘ఓడీయమ్మ హీటు.. ఈడీఎంలో బీటు.. రేడియంలా లైటు’’ అంటూ సాగుతున్న ఈ గీతానికి హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ స్వరాలు సమకూర్చగా.. అనంత శ్రీరామ్‌ సాహిత్యమందించారు. ధృవ్‌ విక్రమ్‌, శ్రుతిహాసన్‌, చిన్మయి సంయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ‘‘ఇకపై మీరు ఎక్కడికి వెళ్లినా.. పార్టీ ఎక్కడ జరిగినా ‘ఓడీయమ్మ..’ పాటే మారు మోగాలి’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని