Hanu Man: హనుమాన్‌ మరో రికార్డు.. ఏకంగా 300 సెంటర్స్‌లో కొనసాగుతున్న హవా

Hanu Man: అగ్ర కథానాయకుల సినిమాలే మూడు వారాల్లో థియేట్రికల్‌ రన్‌ ముగిసిపోతున్న నేటి రోజుల్లో ‘హనుమాన్‌’ 30 రోజులు పూర్తి చేసుకుంది.

Published : 12 Feb 2024 15:14 IST

హైదరాబాద్‌: సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘హనుమాన్‌’ (Hanuman) విడుదలై దిగ్విజయంగా నెల రోజులు పూర్తి చేసుకుంది. చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈక్రమంలో హనుమాన్‌ మరో ఆసక్తికర రికార్డును సృష్టించింది. ఇటీవల కాలంలో 30 రోజుల పాటు, అదీ 300లకు పైగా సెంటర్లలో ప్రదర్శించబడుతున్న చిత్రంగా నిలిచింది.

తేజ సజ్జా కీలకపాత్రలో ప్రశాంత్‌ వర్మ రూపొందించిన ఈ మూవీ ఇప్పటివరకూ రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఒకప్పుడు 50, 100 రోజుల వేడుకలు జరిగేవి. ఇప్పుడు అగ్ర కథానాయకుల సినిమాలే 30 రోజుల్లో థియేట్రికల్‌ రన్‌ ముగిసిపోతోంది. సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’, ‘అయలాన్‌’ వంటి చిత్రాలు ఓటీటీలో కూడా వచ్చేశాయి. కానీ, ‘హనుమాన్‌’కు మాత్రం థియేటర్‌లో ప్రేక్షకాదరణ తగ్గడం లేదు. ఈ నెలలో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసే పెద్ద చిత్రాలేవీ వచ్చే పరిస్థితి లేదు. దీంతో మరో రెండు, మూడు వారాలు ‘హనుమాన్‌’కు ఢోకా లేదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు ‘జై హనుమాన్‌’ను త్వరగా పట్టాలెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్‌వర్మ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కాగా, ప్రీ-ప్రొడక్షన్‌ పనులు మొదలుపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు