Prabhas: ప్రభాస్‌తో హను రాఘవపూడి సినిమా లాక్‌.. ఏ జానరంటే!

తన తర్వాత సినిమా ప్రభాస్‌తో తీయనున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) స్పష్టం చేశారు.

Published : 08 Apr 2024 17:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సీతారామం’తో అందరి మనసులు గెలిచారు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi). ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రభాస్‌తో (Prabhas) సినిమా తీయనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే విషయాన్ని స్వయంగా ఆయనే ఖరారు చేశారు. ప్రభాస్‌తో సినిమా తీయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఆ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు.

ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘నా తర్వాత సినిమా ప్రభాస్‌తో ఉంటుంది. అది పూర్తిస్థాయి పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా. చారిత్రక ఫిక్షన్ చిత్రం. ఇప్పటికే విశాల్ చంద్రశేఖర్‌ ఈ చిత్రం కోసం మూడు పాటలు కూడా కంపోజ్‌ చేశారు’ అని చెప్పారు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్‌ ఉందా.. లేదా.. అని సందేహాలు తొలగిపోయాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై రానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

‘సలార్‌’తో సూపర్ హిట్‌ అందుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్‌ అశ్విన్ దర్శకత్వలో రానున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఇది మేలో ప్రేక్షకుల ముందుకురానుంది. దీనితోపాటు మారుతి  డైరెక్షన్‌లో ‘రాజాసాబ్‌’లో నటిస్తున్నారు. రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో రానున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. వీటి తర్వాత ‘శౌర్యాంగపర్వం’ పేరుతో సలార్‌-2 రానుంది. దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అలాగే మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ హీరో లైనప్‌లో హను రాఘవపూడి సినిమా కూడా చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని