Hanuman tickets: ‘హనుమాన్‌’ టికెట్‌ ధరలపై భారీ తగ్గింపు.. ఆఫర్‌ ఎప్పటివరకూ అంటే?

Hanuman tickets price: మరింత మంది ఫ్యామిలీ ఆడియన్స్‌కు ‘హనుమాన్‌’ మూవీని దగ్గర చేసే ఉద్దేశంతో టికెట్‌ ధరలను తగ్గిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Updated : 16 Feb 2024 20:12 IST

హైదరాబాద్‌: తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన సూపర్‌హీరో ఫిల్మ్‌ ‘హను-మాన్‌’ (Hanuman) హవా ఇంకా కొనసాగుతోంది. ఈ చిత్రం విడుదలై నెల రోజులు దాటినా ఇప్పటికీ పలు థియేటర్స్‌లో మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. తాజాగా చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది.

నైజాంలోని థియేటర్స్‌లో ‘హను-మాన్‌’ టికెట్‌ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో టికెట్‌ ధర రూ.175 ఉండగా, ఇక నుంచి రూ.100కే లభించనుంది. అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.295గా ఉన్న టికెట్‌ ప్రైస్‌ను ఏకంగా రూ.150కు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 23 వరకూ తగ్గించిన ధరలు అందుబాటులో ఉంటాయని చిత్ర బృందం తెలిపింది.

ఇటీవల కాలంలో విడుదలైన మూడు నుంచి నాలుగు వారాలకే చాలా సినిమాలు థియేట్రికల్‌ రన్‌ ముగిసి ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అగ్ర కథానాయకుల సినిమాలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఈ క్రమంలో ‘హనుమాన్‌’ ఇంకా థియేటర్స్‌లో కొనసాగుతుండటం విశేషం. గత వారం వరకూ ఈ సినిమా 300లకు పైగా స్క్రీన్‌లలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో టికెట్‌ ధరలను తగ్గించడం ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకర్షించేందుకు చిత్ర బృందం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని