Hanuman: మరో మైలురాయిని దాటిన ‘హనుమాన్‌’.. ఓటీటీలోనూ కొనసాగుతోన్న హవా

‘హనుమాన్‌’ సినిమా ఓటీటీలో మరో మైలు రాయిని దాటింది.

Published : 24 Mar 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ ‘హనుమాన్‌’ (Hanuman) హవా కొనసాగుతోంది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులంతా ఎదురుచూశారు. వాళ్లకు గుడ్‌న్యూస్‌ చెబుతూ తాజాగా ఇది జీ5 వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలోకి వచ్చిన మొదటిరోజే గ్లోబల్‌ ట్రెండింగ్‌లో నం.1 పొజిషన్‌లో రికార్డు సృష్టించిన ఈ చిత్రం తాజాగా మరో ఘనత సాధించింది. 207 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను దాటేసింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్లు జీ5 వెల్లడించింది. ‘హనుమాన్‌ హవా కొనసాగుతోంది’ అంటూ పోస్ట్‌ పెట్టింది. ఇకపై ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌తో ఇది స్ట్రీమింగ్‌ కానున్నట్లు పేర్కొంది.

మరోవైపు ‘హనుమాన్‌’ సినిమాకు గాను ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్‌ అవార్డ్స్‌లో ఆయన ఉత్తమ దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు. ఈవిషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఇది ఆరంభం మాత్రమేనని పోస్ట్‌ పెట్టారు. తేజ సజ్జా(Teja sajja) హనుమంతు పాత్రలో మెప్పించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌రాయ్‌, అమృత అయ్యర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇది ఊహించని స్థాయిలో విజయం సాధించడంతో దీని సీక్వెల్‌పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.    ‘జై హనుమాన్’ పేరుతో రానున్న సీక్వెల్లో హనుమంతుడే సూపర్‌ హీరోగా కనిపించనున్నట్లు ప్రశాంత్‌వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఆ పాత్ర కోసం స్టార్‌ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని