Pelli SandaD: శ్రీలీల సందడి

రోషన్‌ కథానాయకుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందదీ’. గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 15 Jun 2021 11:09 IST

రోషన్‌ కథానాయకుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’. గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీలీల అనే మరో కొత్త అందం తెలుగు చిత్రసీమకు పరిచయమవుతోంది. సోమవారం లీల పుట్టినరోజు. ఈ సందర్భం చిత్ర బృందం ఆమె వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు మాట్లాడుతూ‘‘రాఘవేంద్రరావు, కీరవాణి కలయికలో సూపర్‌ హిట్‌ సినిమా రూపొందిందని నమ్మకంగా చెబుతున్నా.ఏడు రోజుల ప్యాచ్‌ వర్క్‌ మినహా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. లాక్‌డౌన్‌ పరిస్థితులు కుదుటపడగానే చిత్రీకరణ పూర్తిచేసి ,సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు.

‘‘బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని నేను. మెడిసిన్‌ చదువుతున్నా. ఎందరో కథానాయికల్ని తెలుగు తెరకు పరిచయం చేశారు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న ఈ చిత్రంలో.. నేను హీరోయిన్‌గా నటించడం నాకెంతో ప్లస్‌ అవుతుంది’’ అంది శ్రీలీల.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని