Hari Hara Veera Mallu: పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్‌ ఇదిగో!

‘హరిహర వీరమల్లు’ సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది. నిర్మాణ సంస్థ ఏం చెప్పిందంటే?

Published : 12 Feb 2024 19:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ లేకపోవడంతో.. ఆగిపోయిందా? అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. తాజాగా చిత్ర నిర్మాణసంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా అప్‌డేట్‌ ఇచ్చింది. ‘‘ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇరాన్‌, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ చిత్రం మీ ఊహకు మించి ఉండనుంది. మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెట్టే ప్రోమోను త్వరలోనే విడుదల చేస్తాం. అప్పటివరకు వేచి చూడండి’’ అంటూ పవన్‌ ఫ్యాన్స్‌, సినీ ప్రియులకు విజ్ఞప్తి చేసింది.

17వ శతాబ్దం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో పవన్‌ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్‌ కథానాయిక. కొవిడ్‌ (సెకండ్‌ వేవ్‌), పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్స్‌ షెడ్యూల్స్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు, టీమ్‌ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఈ ప్రాజెక్టు వస్తుందా, రాదా? అంటూ చర్చ జరిగింది. తాజా ప్రకటనతో వాటికి చెక్‌ పెట్టినట్లైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని