Raviteja: మాస్‌ కలయిక.. మరోసారి

ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు రవితేజ - హరీశ్‌ శంకర్‌. ఈ కలయికలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ బుధవారం ఓ చిత్రాన్ని ప్రకటించింది.

Updated : 14 Dec 2023 09:18 IST

ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు రవితేజ - హరీశ్‌ శంకర్‌. ఈ కలయికలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ బుధవారం ఓ చిత్రాన్ని ప్రకటించింది. ‘మిరపకాయ్‌’ తర్వాత రవితేజ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. హిందీలో విజయవంతమైన ‘రైడ్‌’కి రీమేక్‌గా రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం కోసం రవితేజ ప్రత్యేకంగా ఫొటోషూట్‌లో పాల్గొన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని