HAROMHARA: అందరూ పవర్‌ కోసం గన్‌ పట్టుకుంటే..!

సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరోం హర’. జ్ఞాన సాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుమంత్‌ జి.నాయుడు నిర్మిస్తున్నారు.

Updated : 11 May 2023 14:04 IST

సుధీర్‌బాబు (Sudheer Babu) కథానాయకుడిగా నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరోం హర’ (HAROMHARA). జ్ఞాన సాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుమంత్‌ జి.నాయుడు నిర్మిస్తున్నారు. గురువారం సుధీర్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఈ సినిమాలోని ఫస్ట్‌ ట్రిగ్గర్‌ వీడియోని విడుదల చేసింది. ‘‘అందరూ పవర్‌ కోసం గన్‌ పట్టుకుంటారు. కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది...ఇది నాకేమో సెప్తా ఉంది’’ అంటూ వీడియోలో సుధీర్‌బాబు పలికిన సంభాషణ ఆకట్టుకుంటుంది. 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రమిది. డిసెంబరు 22న సినిమా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని