Bahumukham: ఓ మానసిక రోగికి అవమానం జరిగితే..!

‘‘నటుడిగా.. దర్శకుడిగా ఓ వినూత్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని నేను చేసిన ప్రయత్నమే ‘బహుముఖం’. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు మంచి సినిమాటిక్‌ అనుభూతిని అందిస్తుంది’’ అన్నారు హర్షివ్‌ కార్తీక్‌.

Updated : 03 Apr 2024 14:12 IST

‘‘నటుడిగా.. దర్శకుడిగా ఓ వినూత్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని నేను చేసిన ప్రయత్నమే ‘బహుముఖం’. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు మంచి సినిమాటిక్‌ అనుభూతిని అందిస్తుంది’’ అన్నారు హర్షివ్‌ కార్తీక్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈనెల 5న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హర్షివ్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

  • ‘‘తొలుత ఒక విభిన్నమైన లఘు చిత్రం చేసి నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభించాను. అయితే ఈ కథ రాస్తున్న కొద్దీ స్క్రిప్ట్‌.. దీంట్లోని పాత్రలు మరింత ఆసక్తి రేకెత్తించాయి. దీంతో దీని పరిధి పెరిగి సినిమా స్థాయికి వచ్చింది. ఎలాగూ తెలుగులో ఇంత వరకు ఇలాంటి కథలు రాలేదు. అలాగే ప్రస్తుతం సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ను ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. అందుకే నా తొలి ప్రయత్నంగా దీన్ని పట్టాలెక్కించా’’.
  • ‘‘ఈ సినిమాలో నేను కాకుండా కేవలం నా పాత్ర మాత్రమే కనిపించాలన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో చూసి నటనలో మెళకువలు నేర్చుకున్నా. కథక్‌ నృత్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఈ చిత్రానికి ఫణి కల్యాణ్‌ పాటలు, శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నా తదుపరి చిత్రం కోసం ఓ యాక్షన్‌ డ్రామా కథను సిద్ధం చేసుకున్నాను’’.
  • ‘‘మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తి ఓ ఆడిషన్‌కు వెళ్తే.. అక్కడ అతనికి అవమానం జరిగితే.. ఆ తర్వాత అతను ఎంత వరకు వెళ్తాడు? అన్నది ఈ చిత్ర కథాంశం. ఇదొక భిన్నమైన సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. పూర్తిగా యూఎస్‌లోనే చిత్రీకరించాం. ఈ సినిమాతో దాదాపు 40మంది కొత్త నటీనటులు తెరకు పరిచయం కానున్నారు. ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. సైకలాజికల్‌ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారు దీన్ని బాగా ఎంజాయ్‌ చేస్తారు’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని