Heeramandi: హీరామండీ తారల మెరుపులు అప్పుడే

భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్‌ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్‌. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ:

Updated : 29 Mar 2024 11:52 IST

భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్‌ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్‌. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్‌ హైదరీ, రిచా చద్దా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ కీలక పాత్రల్లో తెరకెక్కతున్న సిరీస్‌ ఇది. ప్రేమ, శక్తి, స్వేచ్ఛలను కోరుకునే వేశ్యల జీవితాల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ అందాల తారల ఫస్ట్‌లుక్‌లు, పాటకు అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా మే 1న ఓటీటీలో సినీ ప్రియుల ముందుకు రానున్నట్లు తెలుపుతూ ఓ వీడియోను పంచుకుంది. డైమండ్‌ బజార్‌లో మెరిసే ఆ ఆరుగురి తారల జీవితాల గురించి తెలుసుకోవాలంటే మే వరకూ ఆగాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని