అందర్నీ అలరించే యాక్షన్‌ చిత్రమిది

శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి నాయకానాయికలుగా ఆడారి మూర్తి సాయి తెరకెక్కించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. జి.ఎస్‌.బాబు నిర్మించారు. సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 18 May 2024 00:26 IST

శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి నాయకానాయికలుగా ఆడారి మూర్తి సాయి తెరకెక్కించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. జి.ఎస్‌.బాబు నిర్మించారు. సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు వశిష్ఠ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మూర్తి సాయి మాట్లాడుతూ.. ‘‘కొత్తదనంతో కూడిన యాక్షన్‌ ప్రాధాన్య చిత్రమిది. అన్ని రకాల వాణిజ్య హంగులతో నిండి ఉంటుంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పి.సతీష్‌ కుమార్, ఛాయాగ్రహణం: ఎస్‌.రామకృష్ణ.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని