Kannappa:‘కన్నప్ప’గా మంచు విష్ణు... ఫస్ట్‌లుక్‌ చూశారా?

Kannappa:‘కన్నప్ప’గా మంచు విష్ణు... ఫస్ట్‌లుక్‌ చూశారా?

Updated : 08 Mar 2024 14:59 IST

హైదరాబాద్‌:  మంచు విష్ణు ప్రధానపాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’.  ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ నుంచి చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో మంచు విష్ణు కన్నప్పగా కనిపించి అలరించారు.

భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ మూవీలో ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తుండగా, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని