rana naidu: ‘రానా నాయుడు’లో బోల్డ్‌ కంటెంట్‌... ఈ మీమ్స్‌ చూస్తే నవ్వకుండా ఉండలేరు!

rana naidu: రానా నాయుడు వెబ్‌సిరీస్‌పై సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతున్న మీమ్స్‌మీకోసం..

Published : 13 Mar 2023 04:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రానా (Rana), వెంకటేశ్‌ (Venkatesh) కీలక పాత్రల్లో నటించిన యాక్షన్‌ క్రైమ్‌ డ్రామా ‘రానా నాయుడు’ (rana naidu). ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. వెంకటేశ్‌లాంటి ఫ్యామిలీ హీరో నటించిన తొలి వెబ్‌సిరీస్‌ కావడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే, కుటుంబమంతా కలిసి కూర్చొనే చూసేలా సిరీస్‌ లేకపోవడం ఆయన్ను అభిమానులనే కాదు, సగటు సినీ ప్రేక్షకుడిని కూడా కాస్త నిరాశపరిచింది. సిరీస్‌లో శ్రుతి మించిన శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. వివిధ సినిమాల్లోని సన్నివేశాలను, ఫొటోలను ఎడిట్‌ చేసి, రానా నాయుడు సిరీస్‌కు జత చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. నవ్వులు పంచుతున్న వాటిన మీరు కూడా చూసేయండి.










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని