Nani: ఉస్తాద్‌లో నాని ఎంత గెలిచారు?

కథానాయకుడు మంచు మనోజ్‌ వ్యాఖ్యాతగా పరిచయం అవుతున్న రియాలిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‌’. ర్యాంప్‌ ఆడిద్దాం..అనేది ఉపశీర్షిక. ‘హలో...వెల్‌కమ్‌ టు ది ఉస్తాద్‌ గేమ్‌ షో ర్యాంప్‌ ఆడిద్దాం’ అంటూ ఈటీవీ విన్‌లో ప్రసారం అయ్యే ఆ సెలబ్రిటీ షోతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు మనోజ్‌. ఇటీవల విడుదలైన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Updated : 15 Dec 2023 09:15 IST

ఈటీవీ విన్‌లో నేటి నుంచే ప్రసారం

కథానాయకుడు మంచు మనోజ్‌ వ్యాఖ్యాతగా పరిచయం అవుతున్న రియాలిటీ గేమ్‌ షో ‘ఉస్తాద్‌’. ర్యాంప్‌ ఆడిద్దాం..అనేది ఉపశీర్షిక. ‘హలో...వెల్‌కమ్‌ టు ది ఉస్తాద్‌ గేమ్‌ షో ర్యాంప్‌ ఆడిద్దాం’ అంటూ ఈటీవీ విన్‌లో ప్రసారం అయ్యే ఆ సెలబ్రిటీ షోతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు మనోజ్‌. ఇటీవల విడుదలైన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిమానుల కోసం సినీతారలు ఆడే ఈ ఆటలో రూ.50లక్షల బహుమతిని కూడా అందించనున్నారు. ఎపిసోడ్‌-1 కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది షోని నిర్మిస్తున్న పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. ఈరోజు సాయంత్రం 6గంటలకు ఈటీవీ విన్‌లో ఈ షో తొలి ఎపిసోడ్‌తో అలరించనుంది. ఈ మొదటి ఎపిసోడ్‌కి ఇటీవలే ‘హాయ్‌ నాన్న’తో విజయాన్ని అందుకున్న కథానాయకుడు నాని రానున్నారు. మనోజ్‌తో కలిసి నాని చేసిన అల్లరితో, సరదా ముచ్చట్లతో ఎపిసోడ్‌ వినోదాత్మకంగా ఉండనున్నట్లు తెలిపింది షో బృందం. మరి నాని తన అభిమాని కోసం ఏం గెలిచారు? ఎంత గెలిచారో తెలియాలంటే ఈ షో చూడాల్సిందే!.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని