Nikhil: తండ్రి అయిన నిఖిల్‌.. ‘ఇది వేడుకలు చేసుకోవాల్సిన సమయం’ అంటూ పోస్ట్‌..!

Hero Nikhil: యువ కథానాయకుడు నిఖిల్‌ తండ్రయ్యారు. ఆయన సతీమణి పల్లవి ఓ బాబుకు జన్మనిచ్చారు.

Published : 21 Feb 2024 14:47 IST

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నిఖిల్‌ (Hero Nikhil) తండ్రయ్యారు. ఆయన సతీమణి డాక్టర్‌ పల్లవి బాబుకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు నిఖిల్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈసందర్భంగా తన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటోలను నిఖిల్‌ పంచుకున్నారు. దీంతో చిత్ర పరిశ్రమ వర్గాలు, ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘మా ప్రేమకు గుర్తుగా బేబీని మా జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నాం. ఇది వేడుకలు చేసుకోవాల్సిన సమయం’ అంటూ నిఖిల్‌ పేర్కొన్నారు. 2020లో నిఖిల్‌, పల్లవిల వివాహం జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే ‘స్వయంభూ’ అనే పాన్‌ఇండియా మూవీలో నిఖిల్‌ నటిస్తున్నాడు. దీంతో పాటు, ‘కార్తికేయ 3’ చేయాల్సిఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని