Hi Nanna: ఓటీటీలోకి ‘హాయ్‌ నాన్న’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

థియేటర్లో ప్రేక్షకుల హృదయాలను కదిలించిన చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). ఇది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Published : 30 Dec 2023 12:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నాని (Nani) హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన రొమాంటిక్‌ డ్రామా ‘హాయ్‌ నాన్న’(Hi Nanna). ఈ చిత్రం డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జనవరి 4 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. నాని సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించిన ఈ చిత్రంలో బేబీ కియారా, శ్రుతిహాసన్‌, ప్రియదర్శి కీలకపాత్రలు పోషించారు.

క‌థేంటంటే: విరాజ్ (నాని) ముంబైలో ఓ  ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. పుట్టిన‌ప్ప‌టి నుంచే జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న త‌న కూతురు మ‌హి (కియారా)నే ప్ర‌పంచంగా బ‌తుకుతుంటాడు. కూతురికి స‌ర‌దాగా క‌థ‌లు చెప్ప‌డం విరాజ్‌కి అల‌వాటు. ఆ క‌థ‌ల్లో హీరోగా నాన్న‌ని ఊహించుకుంటూ ఉంటుంది. ఓ రోజు అమ్మ క‌థ చెప్ప‌మ‌ని అడుగుతుంది మ‌హి. నువ్వు  క్లాస్ ఫ‌స్ట్ వ‌స్తే చెబుతానంటాడు. అమ్మ క‌థ కోసం క‌ష్ట‌ప‌డి చ‌దివి క్లాస్ ఫ‌స్ట్ వ‌స్తుంది. అయినా మ‌హికి త‌న అమ్మ క‌థని చెప్ప‌డు విరాజ్‌. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. రోడ్డు ప్ర‌మాదం నుంచి ఆ చిన్నారిని కాపాడుతుంది య‌ష్న (మృణాల్ ఠాకూర్‌). ఆ త‌ర్వాత ఇద్ద‌రూ స్నేహితులు అవుతారు. త‌న కూతురుని వెదుకుతూ వ‌చ్చిన విరాజ్‌కి..  యష్నతో క‌లిసి ఓ కాఫీ షాప్‌లో క‌నిపిస్తుంది. అక్క‌డే విరాజ్.... మ‌హికి త‌న అమ్మ క‌థ‌ని చెబుతాడు. ఈసారి క‌థ‌లో త‌న అమ్మ వ‌ర్ష పాత్ర‌ని యష్నలో ఊహించుకుంటుంది మ‌హి. ఇంత‌కీ ఆ వ‌ర్ష ఎవ‌రు? కూతురు మ‌హిని వ‌దిలి దూరంగా ఎందుకు ఉంది?యష్నకీ, మ‌హి త‌ల్లికీ సంబంధం ఏమిటి? పెళ్లి నిశ్చ‌య‌మైన యష్న... విరాజ్‌ని ఎలా ప్రేమించింది?ఆ ప్రేమ నిల‌బ‌డిందా? చిన్నారి త‌న త‌ల్లి చెంత‌కి చేరిందా లేదా?త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని