సినిమా ‘ట్రైలర్’ ఎలా మొదలైందంటే?
ట్రైలర్.. సినిమాకి ఒక శాంపిల్. కథేంటీ?నటీనటుల ప్రదర్శన ఎలా ఉండనుంది? సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది? వంటి ప్రశ్నలకు దాదాపు 2 నిమిషాలు ఉండే ట్రైలర్‌తో చిత్రబృందం కొంతమేర సమాధానం చెబుతోంది. పూర్తిగా తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే
ట్రైలర్.. సినిమాకి ఒక శాంపిల్. కథేంటీ?నటీనటుల ప్రదర్శన ఎలా ఉండనుంది? సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది? వంటి ప్రశ్నలకు దాదాపు 2 నిమిషాలు ఉండే ట్రైలర్‌తో చిత్రబృందం కొంతమేర సమాధానం చెబుతుంది. పూర్తిగా తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. అలా ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెంచడంలో ట్రైలర్లు కీలక పాత్ర వహిస్తున్నాయి. అందుకే చిత్రబృందాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని రూపొందించి.. విడుదల చేస్తాయి. నిజానికి, ఒకప్పుడు ఈ ట్రైలర్లను సినిమా పూర్తయిన తర్వాత ప్రదర్శించేవారు. ట్రైలర్ అంటేనే చివర్లో ఉండేదని అర్థం వస్తుంది. మరి అలాంటప్పుడు ఈ ట్రైలర్లను సినిమాలు విడుదల కాకముందే ఎందుకు వదులుతున్నారు? అసలు ఈ ట్రైలర్లను ఎవరు కనిపెట్టారు? తెలుసుకోవాలంటే.. ఇది చదవండి..
1910 తర్వాత హాలీవుడ్లో సినిమా రంగం పుంజుకుంది. అప్పట్లో ప్రేక్షకులు కొంత సొమ్ము చెల్లించి థియేటర్లోకి వెళ్లి ఎన్ని సినిమాలైనా చూసే అవకాశముండేది. థియేటర్ యాజమాన్యం ప్రేక్షకుల కోసం విరామం లేకుండా ఫీచర్ సినిమాలు, కార్టూన్లు, షార్ట్ ఫిల్మ్ ఇలా ఒకదాని తర్వాత మరొకటి వరుసపెట్టి ప్రదర్శించేవి. అయితే ఒక సినిమా పూర్తయి మరో సినిమా మొదలు కావడానికి కాస్త సమయం పట్టేది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిల్స్ గ్రాన్‌లుండ్ భావించారు. 1913లో ఆయన మార్కస్ ల్యూ అనే థియేటర్ సంస్థలో మేనేజర్‌గా ఉండేవారు. అలాగే ‘ది ప్లెషర్ సీకర్స్’ అనే సంగీత కార్యక్రమానికి నిర్మాత. అయితే థియేటర్లో ప్రదర్శించబోయే ఈ సంగీత కార్యక్రమంపై ప్రేక్షకులకు ఆసక్తి కల్పించడం కోసం ఆయన వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. సంగీత కళాకారులు రిహర్సల్స్ చేస్తున్న ఫుటేజ్‌లతో స్వల్ప వ్యవధి ఉన్న ఒక ప్రచార చిత్రాన్ని రూపొందించారు. దాన్ని థియేటర్లలో ప్రదర్శించే సినిమాల రీళ్లకు చివర అంటించారు. దీంతో సినిమా చివర్లో ఆయన రూపొందించిన ప్రచారం చిత్రం ప్రదర్శితమైంది. ప్రేక్షకులకు ఆ ప్రచార చిత్రం కొత్తగా అనిపించడమే కాదు, ఆ కార్యక్రమాన్ని చూడాలన్న ఆసక్తి పెంచింది. అలా కార్యక్రమం భారీ విజయం అందుకుంది.
గ్రాన్‌లుండ్ ఆలోచన సినీపరిశ్రమకు తెగ నచ్చేసింది. అదే ఏడాది విలియమ్ సీలిగ్ అనే నిర్మాత గ్రాన్లుండ్తో సహాయంతో తాను నిర్మించిన ఒక సీరియల్ చిత్రానికి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందోననే ఉత్సుకతను రేకెత్తించే చిన్న వీడియోలను రూపొందించారు. వాటిని ప్రదర్శించి తదుపరి ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి కల్పించే విధంగా చేయగలిగారు. ఇలాంటి సీరియల్ చిత్రాలతో పాటు వేర్వేరు సినిమాలకు సంబంధించిన ప్రచార చిత్రాలను కూడా మరో సినిమా రీళ్లకు చివర్లో అతికించేవారు. ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా ప్రచార చిత్రం ప్రదర్శించడం వల్లే వీటికి ‘ట్రైలర్స్’అని పేరొచ్చింది.
1920లో ఈ ట్రైలర్లను రూపొందించడం కోసం ప్రత్యేక సంస్థలు పుట్టుకొచ్చాయి. అయితే, 1930ల్లో అసలు సమస్యను సినీవర్గాలు గమనించాయి. ప్రేక్షకులు ఒక సినిమా పూర్తి అయ్యాక వెంటనే ప్రదర్శితమయ్యే ట్రైలర్లను చూడకుండానే వెళ్లిపోయేవారు. దీంతో ఫలితం లేదనుకున్న సినీవర్గాలు చిత్రం ప్రదర్శించే ముందే ట్రైలర్స్‌ను ప్రదర్శించాలని నిర్ణయించాయి. వాటిని ప్రివ్యూస్ అనేవాళ్లు. కానీ, ట్రైలర్స్ అనే పదం బాగా అలవాటు కావడంతో దాన్నే కొనసాగించారు. అలా సినిమా చివర్లో ఉండే ట్రైలర్లు.. సినిమా ముందుకు వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో సినిమా ట్రైలర్లను రూపొందించి టీవీల్లో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాంలో ఏ సమయంలోనైనా విడుదల చేసుకునే అవకాశం లభిస్తోంది. థియేటర్లలోనూ సినిమాకి ముందు, విరామ సమయంలో ట్రైలర్లను ప్రదర్శిస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
బాలీవుడ్ స్టార్స్‌తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
నెగెటివ్ కామెంట్స్‌ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా..
తాజా వార్తలు (Latest News)
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్‌లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్‌గా మార్ష్.. యంగ్ సెన్సేషన్‌కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్